Mallikarjun Kharge : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అనంత్‌నాగ్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇవాళ దేశంలో మైనారిటీ ప్రభుత్వం కొలువుతీరిందని, అంతకుముందు బీజేపీ 400కుపైగా స్ధానాలు గెలుచుకుంటామని ప్రగల్బాలు పలికిందని, మీ 400 సీట్లు ఎక్కడున్నాయని ఎద్దేవా చేశారు.
400పైగా సీట్లు సాధిస్తామని డప్పు కొట్టుకున్న కాషాయ పార్టీకి అతికష్టం మీద 240 స్ధానాలే దక్కాయని వ్యాఖ్యానించారు. తమకు మరో 20 సీట్లు వచ్చిఉంటే ఈ కాషాయ నేతలంతా జైల్లో మగ్గేవారని, వారికి అదే సరైన ప్రదేశమని ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు మణిపూర్ మళ్లీ భగ్గుమంటున్నా మోదీ సర్కార్ చోద్యం చూస్తోందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే అన్నారు. 16 నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయని, గత 10 రోజుల్లో మణిపూర్‌లో జరిగిన హింసలో 12 మంది మరణించారని చెప్పారు.
మణిపూర్‌లో మాజీ సీఎం ఇంటిపై రాకెట్లతో దాడి చేశారని, గవర్నర్ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారని, ఇంత జరుగుతున్నా దేశ ప్రధానికి మణిపూర్ వెళ్లే తీరిక లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అమెరికా, బ్రిటన్, గ్రీస్, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళుతున్నా మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదని దుయ్యబట్టారు. ఓ రాష్ట్రంలో అలజడి రేగుతుంటే ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రధాని అయినా ఇలా చూస్తూ ఉంటారా అని ఆమె ప్రశ్నించారు.
Read More :
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?