బెంగళూరు, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్ధ విహార్ ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి రెండుసార్లు స్థలాలు పొందిందని బీజేపీ నేత ఎన్ఆర్ నరేశ్ ఆరోపించారు. యెడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా 2010లో బెంగళూర్ డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) ఆయన ట్రస్ట్‌కు 8,125 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించిందని, అనంతరం 2024 మేలో కాంగ్రెస్ సర్కారు కర్ణాటక ఇండస్ట్రీస్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు (కేఐఏడీబీ) నుంచి సివిల్ ఎమినిటీస్ (సీఏ) సైట్ ఐదు ఎకరాలు కేటాయించిందని ఆయన లోకాయుక్తకు దాఖలు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.
మొదటిసారి తనకు కేటాయించిన స్థలం సమాచారాన్ని ఆయన దాచిపెట్టారని తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఖర్గే తన రాజకీయ బలాన్ని ఉపయోగించి రెండో స్థలాన్ని చేజిక్కించుకున్నారని రమేశ్ తెలిపారు.