Khalistan Slogans | వన్డే వరల్డ్ కప్ (World Cup matches)కు ముందు హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ భవనం గోడలపై ఖలిస్థానీ నినాదాలు (Khalistan Slogans) కలకలం రేపుతున్నాయి. ధర్మశాలలో (Dharamsala) జల్ శక్తి డిపార్ట్మెంట్ (Jal Shakti Department Building) గోడలపై దుండగులు ‘ఖలిస్థాన్ జిందాబాద్’ (Khalistan Zindabad) నినాదాలు రాశారు. అదేవిధంగా ఖలిస్థాన్ జెండాలను గోడలపై కలర్ పెయింట్ వేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్ని వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కాగా, పుష్కరకాలం తర్వాత వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. రేపటి నుంచే వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి. ఇక ధర్మశాలలో అక్టోబర్ నెలలో ఐదు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. దీంతో ఆయా జట్లు ధర్మశాల చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు ఆ గోడలకు రంగులు వేయించారు. అదేవిధంగా ఈ చర్యలకు పాల్పడిన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Also Read..
Maharashtra Hospitals | మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి.. 24 గంటల్లో 23 మరణాలు
Chinese sailors | ఎల్లో సముద్రంలో చిక్కుకుపోయిన చైనా సబ్‌మెరైన్.. 55 మంది నావికులు మృతి
Rahul Gandhi | సోనియా గాంధీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్.. వీడియో వైరల్