మాట మార్చని దొంగ

- పలువురు సాక్షులు ఎదురుతిరిగినా అతనిది ఒకటే మాట
- 28 ఏండ్ల నాటి సిస్టర్ అభయ హత్య కేసులో కీలక సాక్ష్యం
- కొట్టాయంలోని ఒక చర్చి ఫాదర్, సిస్టరే హంతకులుగా నిర్ధారణ
తిరువనంతపురం: కేరళలో 28 ఏండ్ల నాటి సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. అభయను క్యాథలిక్ చర్చి ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని దోషులుగా నిర్ధారించింది. వారికి బుధవారం శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించింది. 21 ఏండ్ల అభయ కొట్టాయం బీసీఎం కళాశాలలో చదువుతుండేది. అక్కడే సెయింట్ పియోస్ కాన్వెంట్ హాస్టల్లో ఉండేది. మార్చి 27, 1992న కాన్వెంట్‌లోని బావిలో అభయ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసులు ఈ కేసును మూసేశారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం సెఫీతో కొట్టూర్, పూథ్రిక్కయిల్లకు అక్రమ సంబంధం ఉండేది. మార్చి 27, 1992న కొట్టూర్, సెఫీ శారీరకంగా సన్నిహితంగా ఉండటాన్ని అభయ చూసింది. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని నిందితులు అభయను గొడ్డలితో నరికి చంపి, బావిలో పడేశారు. గత ఏడాది ఆగస్టు 26న విచారణ మొదలవగా ప్రాసిక్యూషన్‌కు పలువురు సాక్షులు ఎదురుతిరిగారు. అయితే, హత్య జరిగిన రోజు కాన్వెంట్లో దొంగతనం చేయడానికి వెళ్లిన అడక్క రాజు అనే ఓ దొంగ... అక్కడ కొట్టూర్, సెఫీని చూశానని సాక్ష్యం చెప్పాడు. రాజు ఒక్కడే మాట మార్చకుండా చివరిదాకా నిలబడ్డాడు.
తాజావార్తలు
- రైతు సంఘాలతో 11వ సారి కేంద్రం చర్చలు
- మనో వేదనతోనే రాజీనామా: బెంగాల్ మంత్రి
- భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- లాకర్లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు
- ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు
- ఇండియా కొత్త రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- నో టైమ్ టు డై.. మళ్లీ వాయిదా
- చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం
- రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు
- మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్‌ప్లస్ సెక్యూరిటీ