న్యూఢిల్లీ : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఓ కన్వన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు (Bomb Blast) కలకలం రేపగా ఈ ఘటనలోఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ఇక ప్రార్ధన సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లలో ప్రధాన అనుమానితుడు ఇంటర్నెట్లో బాంబు తయారీ మెళకువలను నేర్చుకున్నాడని వెల్లడైంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో నిపుణుడైన 48 ఏండ్ల డొమినిక్ మార్టిన్ తాను బాంబులు తయారుచేసేందుకు రూ. 3000 వెచ్చించానని చెప్పాడు.
మార్టిన్ కుటుంబం కొచ్చి సమీపంలోని అద్దె ఇంట్లో గత ఐదేండ్లుగా నివసిస్తోంది. మార్టిన్ గతంలో కొన్నేండ్లు గల్ఫ్‌లో ఫోర్‌మన్‌గా పనిచేశాడు. మార్టిన్ రెండు నెలల కిందట బాంబు పేలుళ్లకు తెగబడేందుకు భారత్‌కు తిరిగివచ్చాడు. బాణాసంచాలో ఉపయోగించే తక్కువ రకం పేలుడు పదార్ధాలతో ఐఈడీలను తయారుచేసినట్టు చెబుతున్నారు. తన ఇంట్లోనే అతడు ఐఈడీలను అసెంబ్లింగ్ చేశాడని పోలీసులు చెప్పారు.
జెవోహ విట్నెస్ సమ్మేళనంలో పాల్గొనే వారిని చంపేందుకు హాల్లోపల మార్టిన్ పేలుడు పదార్ధాలను ఉంచాడని సమాచారం. లొంగిపోయే ముందు మార్టిన్ సోషల్ మీడియా వేదికపై వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ఆ సంస్ధ బోధనలు దేశద్రోహాన్ని ప్రేరేపిస్తుండటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వీడియోలో మార్టిన్ చెప్పుకొచ్చాడు. పిల్లలతో పాటు సమాజానికి తప్పుడు విలువలను బోధిస్తున్నారని మండిపడ్డాడు. ఇలాంటి బోధనలను నిలిపివేయాలని తాను వారించినా వారు వినకపోవడంతోనే బాంబు దాడులకు తెగబడ్డానని చెప్పాడు. కాగా వరుస పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
Read More :
iPhone Hacking: 150 దేశాలకు ఆ అడ్వైజరీ ఇచ్చారు.. హ్యాకింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం