తిరువనంతపురం: కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే (Sabarimala) భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్‌బాట్’ను రూపొందించారు. పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్ లోగోను సీఎం పినరయి విజయన్ ఆవిష్కరించారు. ‘శబరిమల తీర్థయాత్ర అనుభవాన్ని మెరుగుపరచడానికి పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన స్మార్ట్ ఏఐ సాధనం ‘స్వామి’ చాట్‌బాట్ లోగో ఆవిష్కరించడం గౌరవంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఆరు భాషలైన మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడలో శబరిమల గురించి సమగ్ర సమాచారాన్ని ‘స్వామి చాట్‌బాట్’ అందిస్తుంది. శబరిమలలో పూజా సమయాలతోపాటు రైల్వే, విమాన సౌకర్యాలను తెలియజేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చు. శబరిమలలో నవంబర్ 15న ‘మండల పూజా మహోత్సవం’ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తెచ్చారు.
Honoured to unveil the logo of Swami Chat Bot, a smart AI tool developed by the Pathanamthitta district administration to enhance the Sabarimala pilgrimage experience. Accessible in six languages, it offers vital info on temple services, travel, and safety, ensuring a smooth,… pic.twitter.com/EgzzGErQYW
— Pinarayi Vijayan (@pinarayivijayan) November 13, 2024