Pinarayi Vijayan | తిరువనంతపురం : రామోజీ రావు అస్తమయం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు విజయన్ ట్వీట్ చేశారు.
మీడియా, సినీ రంగాల్లో ఆయన సేవలు మరువలేనివి అని కొనియాడారు. కేరళ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీ రావు ఆదుకున్నారు. వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ ఇళ్లు నిర్మించింది. రామోజీ మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఎంతో మందికి ప్రేరణగా, ఆదర్శంగా నిలిచారు. మీడియా అభివృద్ధిలో ఆయన అసమానమైన పాత్ర పోషించారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా ఆయన అంతే కృషి చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పినరయి విజయన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
I extend my heartfelt condolences on the passing of Ramoji Rao, a visionary in the film and media industries; his curiosity, foresight, and determination left an indelible mark on every field he ventured into, serving as an example and inspiration to all. Ramoji Rao played an… pic.twitter.com/nEWfEy6bYh
— Pinarayi Vijayan (@pinarayivijayan) June 8, 2024