Arvind Kejriwal: ఆ కేసులో కోర్టుకు రాను: అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ శాఖ కేసులో వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ కోర్టుకు హాజరుకాలేనని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వరణ కాంత శర్మకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తన అంతరాత్మ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కొత్త వివాదానికి తెరలేపారు. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ కేసులో వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ కోర్టుకు హాజరుకాలేనన్నారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వరణ కాంత శర్మకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తన అంతరాత్మ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. కోపంతోనే, అమర్యాదగానే తాను ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ బాధ, వినయంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయ ప్రక్రియలో సాధారణ పౌరులు ఎదుర్కొనే సమస్యలను లేవనెత్తినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ కేసులో జస్టిస్ స్వరణ కాంత శర్మను తప్పించాలని కోరుతూ ఇటీవల కేజ్రీవాల్ కోరారు. అయితే ఆయన చేసిన అభ్యర్థనను ఏప్రిల్ 20వ తేదీన హైకోర్టు తిరస్కరించింది.
అఖిల భారతీయ అధివక్త పరిషత్ కార్యక్రమాలకు జస్టిస్ స్వరణ కాంత హాజరువుతున్నారని, ఆ సంస్థకు అధికార ప్రభుత్వంతో లింకులు ఉన్నాయని, అందుకే ఆ ఎక్సైజ్ కేసులో ఆ జడ్జీని తప్పించాలని కోరుతున్నట్లు గతంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యాయమూర్తి ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటే, నాకు న్యాయం జరుగుతుందని నేను ఎలా ఆశిస్తానని ఆయన అన్నారు. ఈ కేసులో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇది గాంధేయ సత్యాగ్రహం రీతిలో సాగుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

