న్యూఢిల్లీ : ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ర్టాల్లో ఒక్కదానిలోనైనా తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాన్ని అమలు చేసిందా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, తాము చేసిన పనులను అడ్డుకోవడానికే ఆ పార్టీ ఉందని ఆయన ఆరోపించారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ‘ఉచితాలపై చర్చ’ ప్రచారాన్ని ప్రారంభించారు. ఉచితాల గురించి పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు వివరిస్తారని చెప్పారు. 10 ఏండ్లుగా ఢిల్లీకి బీజేపీ ఏం చేసిందో ఈ సభల్లో తమ నేతలు ప్రశ్నిస్తారని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీపై లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా వ్యంగ్యోక్తిగా పొగడ్తలు కురిపించారు. ‘కేజ్రీవాల్ కన్నా ఆమె వెయ్యి రెట్లు నయం’ అని అన్నారు.