ఆ జడ్జి ఎదుట హాజరు కాను!.. మద్యం పాలసీ కేసుపై కేజ్రీవాల్
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను వ్యక్తిగతంగా కాని న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
- జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న ఆశ లేదు
- మహాత్మాగాంధీ స్ఫూర్తితో సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను వ్యక్తిగతంగా కాని న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నేరుగా జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాసినట్లు ఆప్ సోమవారం వెల్లడించింది. జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న తన ఆశ భగ్నమైందని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నట్లు పార్టీ తెలిపింది. తాను మహాత్మా గాంధీ స్ఫూర్తితో సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వ్యక్తిగతమైనదని, ఆలోచించుకున్న తర్వాత తీసుకున్నదని ఆయన తెలిపారు.
మనస్సాక్షి మాట విని ఈ నిర్ణయం తీసుకున్నానని కేజ్రీవాల్ తన లేఖలో రాశారు. ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తి పిల్లలను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించడాన్ని తన పిటిషన్లో ఆప్ అధినేత ఉదహరిస్తూ ఇందులో ప్రయోజనాలు ముడిపడే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి పక్షపాతంపై సహేతుకమైన అనుమానానికి పరిస్థితి దారితీసిందని ఆయన వాదించారు. అయితే జస్టిస్ స్వర్ణకాంత శర్మ తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న వాదనను తోసిపుచ్చారు. పిటిషనర్ అభిప్రాయం మాత్రమే న్యాయమూర్తి వైదొలగడానికి కారణం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

