న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కేదార్నాథ్ ఆలయానికి మార్గంలో జంగల్ చట్టీకి సమీపంలో శనివారం యాత్రను నిలిపివేసినట్టు రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కోండె విలేకరులకు తెలిపారు. నడకమార్గంలో యాత్రను చేపట్టినవారు మధ్యలో ఎక్కడైనా ఆగాలని, సోన్‌ప్రయాగ్, గౌరీకుంద్ వద్ద వసతులు పరిమితంగా ఉన్నాయని భక్తులను కోరారు.
ప్రస్తుతం ‘ట్రెక్ రూట్’లో (కొండలపై దారి) దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు జరుగుతున్నాయని, దీంతో తిరుగు ప్రయాణం చేస్తున్న యాత్రికులు, గౌరీకుంద్, సోన్‌ప్రయాగ్ నుంచి వెళ్తున్న యాత్రికులను ఆపేశారు.