కేదార్నాథ్: కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శీతాకాలం కోసం గురువారం మూసివేశారు. సైనిక సంగీత బృందం భక్తి గీతాలాపన, భక్తుల ‘జై బాబా కేదార్’ స్మరణల మధ్య కేదార్నాథ్ ఆలయాన్ని మూసేశారు. సుమారు 10 వేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రానున్న ఆరు నెలలు కేదారనాథుడు ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో పూజలు అందుకుంటారు. మరోవైపు వేద మంత్రాల మధ్య యుమునోత్రి ఆలయాన్ని మూసేశారు. రానున్న ఆరు నెలలు యమునా దేవి ఖుషీమఠ్(ఖర్సాలీ) గ్రామంలో భక్తులకు దర్శనమిస్తారు.