Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత
Kedarnath Temple: ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ మూసివేశారు. శీతాకాలం ప్రారంభం నేపథ్యంలో ఆలయంలో దర్శనాలు బంద్ చేశారు. ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు వేద మంత్రాల మధ్య ఆలయానికి తాళం వేశారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ మూసివేశారు. శీతాకాలం ప్రారంభం నేపథ్యంలో ఆలయంలో దర్శనాలు బంద్ చేశారు. ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు వేద మంత్రాల మధ్య ఆలయానికి తాళం వేశారు. ఉత్సవ కేదార్ విగ్రహమూర్తిని అశేష భక్తజనం మధ్య తరలించారు. ఆలయం మూసివేత సందర్భంగా ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. సంప్రదాయ రీతిలో అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. మంగళకరమైన గడియల్లో ఆలయాని తాళం వేశారు. బాబా కేదార విగ్రహమూర్తిని ఊకీమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలించారు. హరహర మహాదేవ్ అని నినాదాలు చేస్తే వేల సంఖ్యలో బాబా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‼️आज केदारनाथ धाम के कपाट शीतकाल के लिए हुए बंद…
#kedarnath https://t.co/Axc6OynolJ— Rajesh Maurya…🖋️ (@rajesh_mauryaup) November 11, 2026
ఈ ఏడాది సుమారు 19 లక్షల మంది భక్తులు కేదారీశ్వరుడి దర్శనం చేసుకున్నారు. శీతాకాలం దృష్ట్యా ఆలయాన్ని మూసివేస్తున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం కేదార్‌నాథ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్ర హారతి ముగిసిన తర్వాత .. భారతీయ ఆర్మీ బ్యాండ్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ఆలయ ప్రధాన పూజారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మళ్లీ వేసవి కాలంలో కేదారీశ్వరుడి ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా ఇవాళ మూసివేశారు.
The portals of the Kedarnath Temple closed for the winter season today— November 11, 2026, at 8:30 AM, on the auspicious occasion of Bhai Dooj
Jai Kedar 🕉️ https://t.co/mOuVuyxTLs
— Jaya_Upadhyaya (@Jayalko1) November 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

