Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Kolkata-Sairang Express: రెడ్ సిగ్నల్ పడింది. ఎమర్జెన్సీ బ్రేక్ కోసం డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ ఆ బ్రేక్స్ పడలేదు. దీంతో రైలు పట్టాలు తప్పింది. అస్సాంలో జరిగిన రైలు ప్రమాదానికి చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గౌహతి: కోల్‌కతా నుంచి సైరంగ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు(Kolkata-Sairang Express) ఇవాళ ఉదయం అస్సాంలోని గౌహతి సమీపంలో పట్టాలు తప్పింది. అయితే ఆ ఘటనకు చెందిన ఓ చిల్లింగ్ వీడియో రిలీజైంది. రైలింజిన్ క్యాబినెట్లో ఉన్న లోకో డ్రైవర్ .. ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసినా.. రైలు ఆగకుండా ముందుకు వెళ్లింది. ఆ ఘటనకు చెందిన వీడియో చిక్కింది. రైలును ఆపేందుకు ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నిస్తున్నా.. రైలింజిన్కు బ్రేక్‌లు పనిచేయలేదు. ఎయిర్ బ్రేక్స్ వేసేందుకు ఇంజిన్ లోపల డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ ఆ బ్రేక్‌లు అప్లయ్ కాలేదు. ఇంజిన్‌కు చెందిన ఎమర్జెన్సీ సిస్టమ్ పనిచేయలేదు. రైలు ఇంజిన్‌లో ఏదీ పనిచేయడం లేదని డ్రైవర్ అరుస్తున్న దృశ్యాలు వీడియోకు చిక్కాయి.
జూనియర్ డ్రైవర్ ఆ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. వేగంగా వెళ్తున్న రైలు.. సమీపంలోని బారికేడ్లను ఢీకొట్టింది. ఆ తర్వాత డిరేల్ అయ్యింది. పట్టాలు తప్పిన రైలుకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిజోరం వెళ్తున్న రైలులోని 5 బోగీలు ఇవాళ పట్టాలు తప్పాయి. కామరూప్ మెట్రో జిల్లాలోని దిగరూ రైల్వే స్టేషన్లో రైలు డిరేల్ అయ్యింది. రైలు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్లు నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే పీఆర్వో కేకే శర్మ తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
*Indian Railways*
At around 06:54 hrs on 11.11.2026, while Train No. 13125 Kolkata – Sairang Express was being received at Digaru Railway Station in Assam to give precedence to another train, *the Loco Pilot could not control the speed,* resulting in aderailment, https://t.co/mNwH9gqq3M— Preeti Sompura (@sompura_preeti) November 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

