Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Siddhu 10 | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథలు, తనదైన కామెడీ టైమింగ్, యూత్‌ను ఆకట్టుకునే నటనతో గుర్తింపు పొందిన సిద్ధు.. తన కెరీర్లో 10వ సినిమాను అధికారికంగా ప్రారంభించారు.
Siddhu 10 | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథలు, తనదైన కామెడీ టైమింగ్, యూత్‌ను ఆకట్టుకునే నటనతో గుర్తింపు పొందిన సిద్ధు.. తన కెరీర్లో 10వ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ‘సిద్ధు 10’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధు జొన్నలగడ్డ.. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలతో చేతులు కలపడం విశేషం.ఈ సినిమాను మోహన్ బి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రారంభోత్సవంతోనే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, సినిమా టైటిల్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసి ప్రాజెక్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తుండటం, ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథాంశం, సిద్ధు పాత్ర స్వభావం వంటి వివరాలను మాత్రం చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. సిద్ధు జొన్నలగడ్డ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన ప్రత్యేకమైన నటన, కామెడీ టైమింగ్, యూత్‌ఫుల్ పాత్రలు. ముఖ్యంగా ‘డీజే టిల్లు’తో ఆయనకు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత కూడా తనదైన శైలిలో విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు తన పదో చిత్రంలో ఒక అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించబోతుండటం ఆసక్తికరంగా మారింది. ప్రేమకథా చిత్రాలకు ఉండే భావోద్వేగాలు, వినోదం, సంగీతం వంటి అంశాలను దర్శకుడు మోహన్ బి ఎలా మలచనున్నారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. సిద్ధు ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ కథలో కొత్తదనం ఉంటుందా? ఆయన పాత్రలో ఎలాంటి ప్రత్యేకత ఉండబోతోంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

