Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ (బుధవారం) భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లలో లాభాల జోరు కనిపించింది. చమురు మంటలు చల్లారడంతో ఆసియా మార్కెట్లు (Asia Markets) ఇవాళ సానుకూలంగా సాగుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ (బుధవారం) భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లలో లాభాల జోరు కనిపించింది. చమురు మంటలు చల్లారడంతో ఆసియా మార్కెట్లు (Asia Markets) ఇవాళ సానుకూలంగా సాగుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1300 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ (Nifty) దాదాపు 300 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడవుతోంది.
మార్కెట్ల జోరు ఫలితంగా మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.513 లక్షల కోట్లకు చేరింది. ఉదయం 11.40 గంటల సమయంలో సెన్సెక్స్ 1304 పాయింట్లు దూసుకెళ్లి 82,411 వద్ద, నిఫ్టీ 339 పాయింట్లు పెరిగి 25,383 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 93.70 గా ట్రేడవుతోంది. నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ షేర్లు రాణిస్తున్నాయి.
హిందాల్కో, రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇండిగో షేర్లు దాదాపు ఐదు శాతానికిపైగా పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయనే అంచనాలతో ముడిచమురు ధరలు దిగొచ్చాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఏకంగా 90 డాలర్ల దిగువకు చేరి మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. బుధవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర స్వల్పంగా పెరిగి 92 డాలర్లకు చేరినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. మన మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూ.7,212 కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ మదుపర్లు కొనుగోలు చేశారు. పలు కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదవ్వడం కూడా సూచీల ర్యాలీకి కారణమైంది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.8 శాతం, దక్షిణకొరియా కోస్పి 0.6 శాతం మేర పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

