Kavach | రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఇటీవలే ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ (Kavach)ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కవచ్’ పనితీరు గురించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా వివరించారు. దట్టమైన పొగమంచు (dense fog) ఏర్పడినప్పుడు ఈ కవచ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలిపే వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. లోకోపైలట్ (loco pilot) బయటకు చూడకుండానే కవచ్ సాయంతో సిగ్నల్ సమాచారాన్ని తన క్యాబిన్ నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Dense fog outside. Kavach shows the signal right inside the cab. Pilot doesn’t have to look outside for signal. pic.twitter.com/cdQJDYNGrk
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 21, 2024
కవచ్‌ను ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్వో) అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ రైళ్లను ప్రమాదాల బారి నుంచి కాపాడటంలో అత్యంత కీలకమైనది. ఒక రైలును మరో రైలు ఢీ కొట్టడం.. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలో సిగ్నల్ కనిపించక ప్రమాదకరంగా ముందుకు వెళ్లడం వంటి అనేక సమస్యలకు ఇది పరిష్కారాలు చూపగలదు. అవసరమైనప్పుడు అత్యవసర బ్రేకులు వేయడమే కాదు.. మార్గంలో సిగ్నల్స్ గురించి లోకోపైలట్లను అప్రమత్తం చేస్తూ రైళ్లు వేగంగా నడిచేందుకు ఉపయోగపడుతుంది. అయితే, ప్రస్తుతం ఈ వ్యవస్థను కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 17వ ఘటన
LPG tanker blast | ఎల్పీజీ ట్యాంకర్ పేలుడు ఘటనలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. 30 మంది పరిస్థితి విషమం
Uttar Pradesh: లింగ మార్పిడి చేయించుకున్నాకే.. యూపీలో పెళ్లి చేసుకున్న సేమ్ సెక్స్ కపుల్