న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన ఇద్దరు మహిళలు.. స్వలింగ సంపర్క(Same Sex Couple) వివాహం చేసుకున్నారు. అయితే సామాజిక సమస్యలను అధిగమించేందుకు ముందుగా వాళ్లు లింగమార్పిడి చేయించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శివంగి, జ్యోతి .. కన్నౌజ్‌లోని సదర్ కోత్వాల్లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లికి ముందు శివంగి లింగ మార్పిడి చేయించుకున్నది. తొలుత ఆమె పేరును రన్నూగా మార్చుకున్నది. తండ్రి జ్వలరీ షాపులో జ్యోతి అనే అమ్మాయి పరిచయం అయ్యింది.
బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కోసం కిరాయి అవసరం రావడంతో.. జ్యోతి, శివంగి మధ్య స్నేహం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత వారి మధ్య స్నేహం ముదిరింది. ఆ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీని కోసం శివంగి 7 లక్షల ఖర్చు చేసి లింగమార్పిడి చేయించుకున్నది. సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే కుటుంబం అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందని, శివంగి లింగ మార్పిడి చేయించుకున్నది.
లక్నో, ఢిల్లీలో సర్జరీలు చేయించుకున్నది. ఆ తర్వాత తన పేరును శివంగి నుంచి రన్నూగా మార్చుకున్నది. జెండర్ ఛేంజ్ కోసం నాలుగవ ఆపరేషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నది. కానీ ఈ లోపు వాళ్లు కుటుంబాలు దీవించాయి. దీంతో ఆ జంట నవంబర్ 25వ తేదీన పెళ్లి చేసుకున్నది.