శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండిట్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పురాణ్ కృషన్ భట్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం తన ఇంటి ముందు ఉండగా, అతనిపై టెర్రరిస్టులు దాడి చేశారు.
కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు. పండిట్‌ను హత్య చేసిన ఏరియాతో పాటు సమీప ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
#Terrorists fired upon a #civilian (minority) Shri Puran Krishan Bhat while he was on way to orchard in Chowdari Gund #Shopian. He was immidiately shifted to hospital for treatment where he #succumbed. Area cordoned off. Search in progress.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 15, 2022