పండిట్ల బతుకుపోరు
కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫలమయ్యాయని ఆరోపిస్తూ పండిట్ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు.
- కశ్మీర్ నుంచి తరలించాలని 40 రోజులుగా నిరసనలు
- మీడియాతో మాట్లాడారని మహిళలకు బెదిరింపులు
- ఎముకలు కొరుక్కుతినే చలిలో బిడ్డలతో మహిళల దీక్ష
- పట్టించుకోని సర్కార్.. అమర్నాథ్ యాత్ర పేరిట దాటవేత
శ్రీనగర్, జూలై 5: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫలమయ్యాయని ఆరోపిస్తూ పండిట్ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నలభై రోజుల నుంచి శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. ఎముకలు కొరుక్కుతినే చలిలో, చంటి బిడ్డలను వెంటబెట్టుకొని వందలాది మంది మహిళా ఉద్యోగులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
మీడియాతో మాట్లాడుతున్నందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మీడియాలో ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్నప్పటికీ, తమ గొంతును గుర్తించి కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు వాపోతున్నారు. కాగా, పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల కోసం అదనపు క్వార్టర్లు నిర్మిస్తున్నామని, భద్రతను పెంచుతున్నామని జమ్ము రిలీఫ్ కమీషనర్ అశోక్ పండితా తెలిపారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే సమస్యకు పరిష్కారం దొరకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా యంత్రాంగం ఇలాంటి మాటలే చెబుతూ దాటవేతధోరణి ప్రదర్శిస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను లోయ నుంచి వెంటనే వేరే ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
గుడ్డి నమ్మకమే ప్రాణం తీసింది
నా భర్త అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు. లోయలో పండిట్ల భద్రత గురించి ఎన్నడూ అనుమానాలు పెట్టుకోలేదు. ఆ గుడ్డి నమ్మకమే ఆయన ప్రాణాలు తీసింది.
– మీనాక్షి భట్, రాహుల్ భట్ భార్య
ఉద్యోగమా? ప్రాణమా?
ఉద్యోగమా? ప్రాణమా? అనే ప్రశ్న ప్రస్తుతం నా ముందు ఉన్నది. అయితే, ప్రాణం కంటే విలువైంది ఏముంటుంది? అందుకే ఉద్యోగాన్ని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నా.
– రూబన్ సప్రూ, టీచర్
ఇప్పుడు తెలిసొచ్చింది
ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగం లో చేరా. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అబద్ధమేనని ఆలస్యంగా తెలుసుకున్నా. ఉద్యోగంలో చేరాలన్న నా నిర్ణయం తప్పని ఇప్పుడు అనిపిస్తున్నది.
– రాకేశ్ పండితా, ఉద్యోగి
అదో పొలిటికల్ స్టంట్
పీఎం ప్యాకేజీ ఓ పొలిటికల్ స్టంట్. మాకు భద్రత లేదు. ‘నువ్వు హిందూ మహిళవు. నీకు తగిన గుణపాఠం చెప్తాం’ అంటూ నా ముస్లిం సహోద్యోగులు అంటున్నారు. నేను చేసిన తప్పేంటి?
-ఓ మహిళా ఉద్యోగిని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

