న్యూఢిల్లీ: ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) అమ్మకాల్లో దక్షిణాది రాష్ర్టాలు టాప్ పొజిషన్లో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో 23.18 కోట్ల కేసుల ఐఎంఎఫ్ఎల్ అమ్ముడుపోయింది. అంటే దేశంలో జరిగిన అమ్మకాల్లో 58 శాతం ఇక్కడే జరిగాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎఫ్ఎల్ అమ్మకాల్లో దక్షిణాది ఆధిపత్యం దాదాపు పరిపూర్ణంగా ఉంది. 58 శాతం అమ్మకాలు ఇక్కడే జరుగుతున్నాయి. మిగిలిన 42 శాతం దేశంలోని ఇతర రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నది. అయితే, కర్ణాటకలో 6.88 కోట్ల కేసులు అమ్ముడుపోవడంతో ఆ రాష్ట్రం ఈ చార్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 6.47 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.