ఆగ్రహించినందుకు.. ఉపాధ్యాయుడిపై డస్ట్‌బిన్‌తో విద్యార్థుల దాడి
Karnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్‌తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ తేదీన చోటు

బెంగళూరు : ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్‌తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించగానే.. ఫ్లోర్‌పై గుట్కా పాకెట్ కనిపించింది. దీంతో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రమశిక్షణతో ఉండాలని మంచి మాటలు చెప్పారు. ఇవేమీ పట్టించుకోని విద్యార్థులు.. గందరగోళ వాతావరణం సృష్టించారు. పాఠం బోధిస్తున్న టీచర్‌పై డస్ట్‌బిన్‌తో దాడి చేశారు. కింద పడ్డ డస్ట్‌బిన్‌ను తీసుకెళ్లి టీచర్ తలపై బోర్లించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసిన చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని విద్యాశాఖను, పోలీసులను ఆదేశించారు. టీచర్ పై దాడి చేసిన విద్యార్థులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే మంచి మనసున్న ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థులపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కేసు నమోదైతే విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగే అవకాశం ఉందని ఆ టీచర్ అభిప్రాయపడ్డాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

