బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి రాష్ట్రంలో చోటుచేసుకున్న భారీ అవినీతి, అక్రమాలను బయటపెట్టారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదని, అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తున్నదంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక మాఫియా ఏజెంట్లతో అధికారులు కుమ్మక్కయ్యారని, దీంతో రూ.400 కోట్లకుపైగా రాయల్టీని రాష్ట్రం కోల్పోతున్నదని ఆయన అన్నారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్యకు ఆయన లేఖ రాశారు.