బెంగళూరు: రుతుపవనాల రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో రుతుపవానాల రాకకుముందు నుంచే అంటే గత నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ ఉదయం తెలంగాణలోనూ పలుచోట్ల భారీ వర్షం పడింది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కుంభవృష్టి కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది. రహదారులను వరదలు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రానున్న మూడు రోజుల్లో నగరంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ కురిసిన వర్షానికి బెంగళూరులోని శివాజీ నగర్ ఏరియాను సైతం వరదలు ముంచెత్తాయి. ఆ వరదలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.
Karnataka | Rain lashes Bengaluru, visuals from Shivaji Nagar area
— ANI (@ANI) June 3, 2021
India Meteorological Department predicts 'isolated heavy rainfall' over the state during the next 3 days pic.twitter.com/M8uFtffCow