Police Jobs to Transgenders | ట్రాన్స్జెండర్లకు సామన్య ప్రజల్లా హక్కులు ఉంటాయని.. వాళ్లను థర్డ్ జెండర్‌గా భారత్ గుర్తించింది. అందరిలాగే వాళ్లకూ అన్ని హక్కులు ఉంటాయి. కానీ.. ఉద్యోగాల విషయంలో మాత్రం ఇప్పటికే ట్రాన్స్జెండర్లను చాలా కంపెనీలు పక్కన పెడుతున్నాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వాళ్లకు అవకాశాలు ఉండటం లేదు.
అందుకే.. కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్.. ట్రాన్స్జెండర్ల కోసం గొప్ప నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకునేందుకు రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది.
స్పెషల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్లో ట్రాన్స్జెండర్లకు కూడా డిపార్ట్మెంట్ అవకాశం కల్పించింది.
70 పోస్టులలో 5 పోస్టులు కేవలం ట్రాన్స్జెండర్ల కోసమే రిజర్వ్ చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలన్న ఆశయం ఉన్న ట్రాన్స్జెండర్లు.. ఆన్లైన్ పద్ధతి ద్వారా డిసెంబర్ 12 నుంచి జనవరి 18 వరకు అప్లయి చేసుకోవచ్చు.. అని అడిషనల్ డీజీపీ తెలిపారు.
కర్ణాటక పోలీసు శాఖలోనే కాదు.. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కూడా ట్రాన్స్జెండర్లను రిక్రూట్ చేసుకోనుంది. ఇటీవల ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ట్రాన్స్జెండర్లకు 3 వెకెన్సీలు ఉన్నాయి. 206 సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ల కోసం నియామాకలు జరగనున్నాయి. జనవరి 15 వరకు అప్లయి చేసుకోవచ్చు.
కర్ణాటక సివిల్ సర్వీసెస్(జనరల్ రిక్రూట్మెంట్) రూల్స్ 1977 ప్రకారం ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రూల్ ప్రకారమే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పిస్తున్నామని అడిషనల్ డీజీపీ తెలిపారు. వాళ్ల కోసం రిజర్వ్‌లో ఉంచిన ఐదు పోస్టులలో నాలుగు పోస్టులు కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్‌లో స్పెషల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల కోసం, ఐదోది ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో స్పెషల్ రిజర్వ్ పోస్ట్ కోసం నియామాకలు చేపట్టనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దిన పత్రిక, వాటర్ బాటిల్ కోసం 20 రూపాయలు కట్టాల్సిందే.. వివాదాస్పదమైన రైల్వే నిర్ణయం
మాంఝీ నాలుక కోసితెచ్చే బ్రాహ్మణుడికి రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తా..!
Work Culture: వారానికి 4 రోజులే పనిదినాలు.. వచ్చే ఏడాది నుంచి కొత్త లేబర్ కోడ్
చరిత్రలో ఈరోజు: దినపత్రికలో క్రాస్ వర్డ్ పజిల్ ముద్రణకు 108 ఏండ్లు