చరిత్రలో ఈరోజు: దినపత్రికలో క్రాస్ వర్డ్ పజిల్ ముద్రణకు 108 ఏండ్లు
Today History: మనం నిత్యం దినపత్రికల్లో చూసే క్రాస్ వర్డ్ పజిల్ ముద్రించి సరిగ్గా ఇవాల్టికి 108 ఏండ్లు పూర్తయ్యాయి. 1913 లో తొలిసారిగా దినపత్రికల్లో క్రాస్ వర్డ్ పజిల్‌ను...

(Today History): మనం నిత్యం దినపత్రికల్లో చూసే క్రాస్ వర్డ్ పజిల్ ముద్రించి సరిగ్గా ఇవాల్టికి 108 ఏండ్లు పూర్తయ్యాయి. 1913 లో తొలిసారిగా దినపత్రికల్లో క్రాస్ వర్డ్ పజిల్‌ను ముద్రించగా.. ఇవ్వాల్టికీ దాని ప్రత్యేకత చెక్కుచెదరలేదు. ఇప్పటికీ చాలా పత్రికలు ఈ రకం పజిల్స్ ముద్రించి పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇవి వారాంతాలకే పరిమితమయ్యాయి. ఆదివారం వచ్చిందంటే, పత్రికల్లో, ప్రత్యేక బుక్‌లో ముద్రించే పజిల్స్‌ను పూరించేందుకు ఎందరో ఆత్రంగా ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదేమో!
అమెరికాకు చెందిన దినపత్రిక ‘ది న్యూయార్క్ వరల్డ్’ తొలిసారి 1913 లో క్రాస్ వర్డ్ పజిల్‌ను ముద్రించి పాఠకులకు చేర్చింది. దీన్ని బ్రిటీష్ జర్నలిస్ట్ ఆర్థర్ వేన్ రూపొందించారు. దీనికన్నా ముందు దీని పేరు వర్డ్ క్రాస్. టైపింగ్‌లో పొరపాటు కారణంగా కొంత సమయం తర్వాత.. వర్డ్ క్రాస్‌కు బదులుగా క్రాస్ వర్డ్ అని వ్రాసారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరుతోనే పిలుస్తున్నారు. మొదట్లో పజిల్ డైమండ్ ఆకారంలో ఉండేది. బ్లాక్ బాక్స్‌లు లేవు. 1923 నాటికి అమెరికాలోని దాదాపు అన్ని వార్తాపత్రికల్లో ఇటువంటి పజిల్స్ ప్రచురించారు.
1922-23 నాటికి ఈ క్రాస్ వర్డ్ పజిల్ బ్రిటన్‌కు కూడా చేరింది. బ్రిటీష్ పత్రికలు తమ స్వంత శైలిలో అభివృద్ధి చేశారు. అమెరికన్ పజిల్స్ కంటే చాలా కష్టంగా బ్రిటన్‌లో పజిల్స్ ఉండేవి. బ్రిటన్‌లోని ‘ది సండే టైమ్స్’లో ప్రచురితమైన పజిల్ అత్యుత్తమమైనదిగా చెప్తుంటారు. క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో వివిధ రూపాల్లో పజిల్స్ కనిపించడం ప్రారంభమైంది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2012: యూట్యూబ్‌లో బిలియన్ వీక్షణలను పొందిన మొదటి వీడియోగా నిలిచిన దక్షిణ కొరియా గాయకుడు పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ పాట
1974: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నౌకాదళంలోకి ప్రవేశించిన మొట్టమొదటి యుద్ధనౌక ఐఎన్ఎస్ శాతవాహన్
1971: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నాలుగో సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన కర్ట్ వాల్డ్‌హీమ్
1968: ఫ్లోరిడాలోని కేప్ కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అపోలో 8 ప్రయోగం
1937: మొట్టమొదటి పూర్తి-నిడివి యానిమేటెడ్ చలన చిత్రం ‘స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్’ విడుదల
1898: రేడియంను కనుగొన్న రసాయన శాస్త్రవేత్త పియర్, అతని భార్య మేరీ క్యూరీ
1845: తొలి ఆంగ్లో-సిఖ్ యుద్ధం ప్రారంభం
ఇవి కూడా చదవండి..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

