MLC Election | కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. ఏడింటిలో ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుపు.. రెండు బీజేపీకి
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మండలిలో సభ్యులుగా ఉన్న వారిలో ఏడుగురి పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తుంది.
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మండలిలో సభ్యులుగా ఉన్న వారిలో ఏడుగురి పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తుంది. పదవీ కాలం ముగియనున్న వారిలో నలుగురు కాంగ్రెస్ సభ్యులు, ఇద్దరు బీజేపీ సభ్యులుకాగా, ఒకరు జేడీఎస్ సభ్యుడు ఉన్నాడు. దీంతో ఖాళీ అయ్యే ఏడు ఎమ్మెల్సీ స్థానాల కోసం గురువారం బెంగళూరులోని విధాన సౌధలో ఎన్నికలు నిర్వహించారు.
ఉదయ 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి బీకే హరిప్రసాద్, తిప్పన్నప్ప కాంకానూర్, పీవీ మోహన్, బీఎస్ శివన్న (మాలవల్లి), వినయ్ కార్తీక్ ప్రకాష్ గెలుపొందారు. బీజేపీ నుంచి లింగరాజ్ పాటిల్, రఘు ఆర్ గెలిచారు. జేడీఎస్ నుంచి పోటీ చేసిన గోవిందర రాజు ఓటమిపాలయ్యారు. తాజా విజయంతో కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 39కి చేరింది. బీజేపీకి 29 సీట్లు, జేడీఎస్‌కు 6 సీట్లు ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలుపొందాలంటే 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఈ ఎన్నికల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే, జేడీఎస్ అభ్యర్థికి 18 ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీనిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

