బెంగళూరు : దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ ఊహించని విధంగా కానుకలను అందించారు.
మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు రూ. లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, ఒక చీర, ధోతీతో పాటు డ్రై ఫ్రూట్స్‌ను అందజేశారు. గ్రామపంచాయతీ సభ్యులకు రూ. లక్ష కంటే తక్కువ నగదు అందించారు. బంగారం ఇవ్వలేదు. ఇక కిలో వెండి, చీర, ధోతీ, డ్రై ఫ్రూట్స్ కానుకగా ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఖరీదైన కానుకలు అందించడంతో మంత్రి ఆనంద్ సింగ్ తీవ్ర విమర్శులు ఎదుర్కొంటున్నారు.