బెంగళూరు: కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆయన రంగును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని చన్నపట్న శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా సీపీ యోగీశ్వర, ఎన్డీయే అభ్యర్థిగా కుమార స్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.
యోగీశ్వర గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి, కొంత కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్లో చేరారు. దీని గురించి జమీర్ మాట్లాడుతూ, కాంగ్రెస్లో కొన్ని విభేదాల వల్ల యోగీశ్వర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని, ఆయనకు బీజేపీలో చేరడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆయన జేడీఎస్లో చేరడానికి సిద్ధంగా లేరని, ఎందుకంటే, బీజేపీ కన్నా ‘కర్రి’ కుమార స్వామి ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు. ఇప్పుడు ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారన్నారు. జమీర్ వ్యాఖ్యలపై జేడీఎస్ మండిపడింది. మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.