భార్య కొట్టిందంటూ… ప్రధాని కార్యాలయానికి వ్యక్తి ఫిర్యాదు
చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. తన భార్య కత్తితో పొడిచిందని ఆచార్య ఆరోపించాడు. చంపుతానని తనను బెదిరిస్తున్నదంటూ భయాందోళన వ్యక్తం చేశాడు.
బెంగళూరు: భార్య తనను కొట్టిందంటూ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఆరోపించాడు. ప్రధాని కార్యాలయానికి దీనిపై ఫిర్యాదు చేశాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య, అక్టోబర్ 29న ఈ మేరకు ట్వీట్ చేశాడు. ‘నాకు ఎవరైనా సహాయం చేస్తారా? ఎందుకంటే నేను పురుషుడ్ని’ అని ఆచార్య అందులో పేర్కొన్నారు. ‘నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు గొప్పగా చెప్పే నారీ శక్తి ఇదేనా? నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదా?’ అని ఆ ట్వీట్లో ఆ ప్రశ్నించాడు. తన చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. తన భార్య కత్తితో పొడిచిందని ఆచార్య ఆరోపించాడు. చంపుతానని తనను బెదిరిస్తున్నదంటూ భయాందోళన వ్యక్తం చేశాడు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డికి కూడా ఈ ఫ్యిరాదు ట్వీట్ను ట్యాగ్ చేశాడు.
కాగా, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి దీనిపై స్పందించారు. సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి న్యాయ సహాయం పొందవచ్చని యదునందన్ ఆచార్యకు ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. మరోవైపు నెటిజన్ల నుంచి కూడా ఆచార్యకు మద్దతు లభిస్తున్నది. భార్యల నుంచి భర్తలు ఎదుర్కొనే వేధింపులను పరిగణించాలని, వీటిపై సీరియస్గా స్పందించి చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
https://twitter.com/yaadac/status/1586333846244507648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1586333846244507648%7Ctwgr%5E49a430ccd56d6613a3f876b7f4be3b3a66ce1c7a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Fmirror-now
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

