Karnataka | కొవిడ్ జేఎన్.1 వేరియంట్.. కర్ణాటకలో మాస్క్ మస్ట్
దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది.
బెంగళూరు: దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం (Karnataka) అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు (కఫం) ఉన్నవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని (Mask Mandatory) ఆదేశాలు జారీచేసింది. కేరళలో (Kerala) కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్ (Dinesh Gundu Rao) ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే దవాఖానలు, హెల్త్ సెంటర్లకు సూచించామని చెప్పారు.
కేరళ సరిహద్దు జిల్లాలైన కొడగు, మంగళూరు, చామరాజనగర్ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు. సరిహద్దుల్లో మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్నది తెలిపారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు.
కాగా, దేశంలో కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల నమోదును పర్యవేక్షించడంతోపాటు వాటి గురించి రిపోర్ట్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం జాతీయ ల్యాబ్లకు పంపాలని తెలిపింది. తద్వారా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుందని కేంద్రం పేర్కొంది.
మరోవైపు రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. పరిశుభ్రత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని నివారించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు, అవగాహన కార్యక్రమాలు వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

