Karnataka | బెంగళూరు, ఆగస్టు 29: కర్ణాటకలో బీరు తాగేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. రాష్ట్రంలో బీర్ల ధరల్ని రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం పేర్కొన్నది. బీర్ల బ్రాండు, ఆల్కహాల్ కంటెంట్‌ను బట్టి ధరల పెంపు ఉంటుంది.
త్వరలో బెంగళూరులో నల్లా చార్జీలు పెంచబోతున్నట్టు ఇటీవల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బీర్ల చార్జీలు కూడా పెంచనున్నట్టు వార్తలు వెలువడటంతో కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల నుంచి నీళ్ల వరకు అన్ని ధరలను సిద్ధరామయ్య సర్కారు పెంచుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు.