బెంగళూరు : కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్ఎల్ భోజెగౌడ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన బుధవారం శాసన మండలిలో మాట్లాడుతూ, తాను చికమగళూరు పురపాలక సంఘం చైర్మన్గా పని చేసిన కాలంలో 2,800 వీధి కుక్కలను చంపించానని చెప్పారు. వాటిని చెట్ల కింద పాతి పెట్టించానన్నారు. దీనివల్ల చెట్లకు సహజమైన ఎరువు లభిస్తుందని తెలిపారు. తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, జంతు హక్కుల మద్దతుదారులు, ప్రజలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.