బెంగళూరు, ఫిబ్రవరి 7 : బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. క్రిమినల్ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం పాక్షికంగా ఆమోదంతెలియజేసింది.