Student | ఒత్తిడి కారణంగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది (engineering student dies by suicide). కొడుగు జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న యువతి తన హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. రాయ్‌చూర్‌కు చెందిన మహన్‌టప్ప దంపతులకు తేజస్విని (19) ఒక్కటే కూతురు. ఆమె పొన్నంపేటలోని హళ్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరింది. మూడు రోజుల క్రితం తేజస్విని తన 19వ పుట్టిన రోజును ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఈ బర్త్‌డే వేడుకలు మిస్సైన ఫ్రెండ్స్‌కు బుధవారం స్వీట్స్ కూడా పంచింది. ఆ తర్వాత తరగతులు ముగించుకుని సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని తన హాస్టల్ గదికి వెళ్లిపోయింది.
సుమారు 4.30 గంటలకు ఆమె స్నేహితురాలు ఒకరు తేజస్విని గది తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించింది. దీంతో అనుమానం వచ్చి తలుపు తట్టగా ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఆమె ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఈ విషయాన్ని హాస్టల్ సూపర్వైజర్ దృష్టికి తీసుళ్లింది. వెంటనే హాస్టల్ సిబ్బంది అక్కడికి చేరుకొని తలుపులు బలవంతంగా తెరిచి చూడగా తేజస్విని లోపల అపస్మారకస్థితిలో కనిపించింది.
వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. ఇక తన గదిలో సూసైడ్ నోట్‌ను అధికారులు గుర్తించారు. అందులో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తేజస్విని రాసింది. ఇందుకు కారణం అకడమిక్ ఒత్తిడి (academic pressure) అని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఆరు సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌లు (backlogs) కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటననపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
LeT commander | పాక్ నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్