NEET Controversy : నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకల ఆరోపణలు, ప్రశ్నాపత్రం లీకేజ్ రగడ వ్యవహారంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.
నీట్ అక్రమాలపై తానూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించానని, తాము న్యాయం జరగాలని కోరుతున్నామని అన్నారు. నీట్ అక్రమాలపై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించిన తీరు ప్రశంసనీయమని, ఈ వ్యవహారంపై కోర్టు ఎన్టీఏ తీరును ఎండగట్టిందని పేర్కొన్నారు.
లక్షలాది విద్యార్ధుల భవితవ్యం, వారి ఆకాంక్షలు మనకు ప్రధానమని, ఈ విషయంలో న్యాయస్ధానం చొరవ అభినందించదగినదని మంత్రి అన్నారు.
Read More :
Malaysia Airlines | ఇంజిన్లో మంటలు.. శంషాబాద్లో కౌలాలంపూర్ విమానానికి తప్పిన ప్రమాదం