బెంగళూరు, సెప్టెంబర్ 9: కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాలమే సమాధానం చెబుతుంది. ఆశ లేకపోతే జీవితమే లేదు. నాయకత్వ మార్పుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ అన్నారు.
మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలం ఐక్యతలో ఉందని, డీకే, సీఎం సిద్ధరామయ్య వంటి కొందరిపై ఆధారపడి లేదని అన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ఆయన కొట్టిపారేశారు.