బెంగళూరు, ఆగస్టు 29: అక్రమాస్తుల కేసులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
ఈ కేసును లోకాయుక్తకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తోసిపుచ్చింది. ఈ అంశాలను సుప్రీంకోర్టు పరిష్కరించాలని పేర్కొంది. డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో, అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సీబీఐకి అనుమతిని ఉపసంహరించింది.