Karnataka | కాషాయ సర్కార్ పతనం : విధాన సౌధను గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి సిద్ధరామయ్య సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు.
బెంగళూర్ : కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి సిద్ధరామయ్య సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ అవినీతి పాలనకు చరమగీతం పాడటంతో తాము ఈ కార్యక్రమం చేపట్టామని కార్యకర్తలు తెలిపారు.
డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అంతకుముందు గోమూత్రంతో విధాన సౌధను శుభ్రం చేయాల్సి ఉందని ఈ ఏడాది జనవరిలో పేర్కొన్నారు. విధాన సౌధను క్లీన్ చేసేందుకు తన వద్ద గోమూత్రం సిద్ధంగా ఉందని అప్పట్లో చెప్పుకొచ్చారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కాలుష్యంతో కప్పేసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం సాగించిన పలు స్కామ్ల వివరాలతో కాంగ్రెస్ కరప్షన్ రేట్ కార్డును ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసింది.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా రూ. లక్షన్నర కోట్లు లూటీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పదవికి రూ. 2500 కోట్లు, మంత్రి పదవికి రూ. 500 కోట్లు బీజేపీ బేరం పెట్టిందని విమర్శించింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వమని విమర్శలు గుప్పించింది. ఇక మఠాలకు నిధుల కేటాయింపులకు 30 శాతం, కాంట్రాక్టులకు 40 శాతం, కొవిడ్-19 సరఫరాలకు 75 శాతం వరకూ కాషాయ నేతలు కమీషన్లు వసూలు చేశారని ఆరోపించింది.
Read More
Chidambaram | నల్లధనం మార్చుకునేవారికి మోదీ ప్రభుత్వం రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోంది : చిదంబరం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

