KPCC | బెంగళూరు: కర్ణాటకలో ఓ ఉపాధ్యాయురాలిపై(38)పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాంగ్రెస్ నేత డాక్టర్ బీ గురప్ప నాయుడిపై కేసు నమోదైంది. బాధితురాలు త్యాగరాజ నగర్లో టీచర్‌గా పని చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 26న సీకే అచ్చుకట్టు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.
ప్రస్తుతం కర్ణాటక పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న గురప్ప ఓ కామ పిశాచి అని ఆమె ఆరోపించారు. తనను తన చాంబర్లోకి పిలిచి, అసభ్యకరంగా మాట్లాడటంతోపాటు, తన చేతిని పట్టుకుని తనవైపుకు లాగాడని చెప్పారు. తాను అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడన్నారు. తర్వాత పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు.