కర్ణాటక కాంగ్రెస్ నేత బీ గురప్ప నాయుడిపై బహిష్కరణ వేటు పడింది. ఆయన ఓ టీచర్‌ను లైంగికంగా వేధించారని, ఆమె గౌరవ, మర్యాదలకు భంగం కలిగించారని కేసు నమోదవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ చర్య తీసుకుంది.
కర్ణాటకలో ఓ ఉపాధ్యాయురాలిపై(38)పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాంగ్రెస్ నేత డాక్టర్ బీ గురప్ప నాయుడిపై కేసు నమోదైంది. బాధితురాలు త్యాగరాజ నగర్లో టీచర్‌గా పని చేస్తున్నారు.