బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ నేత బీ గురప్ప నాయుడిపై బహిష్కరణ వేటు పడింది. ఆయన ఓ టీచర్ను లైంగికంగా వేధించారని, ఆమె గౌరవ, మర్యాదలకు భంగం కలిగించారని కేసు నమోదవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ చర్య తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి ఆరు సంవత్సరాలపాటు బహిష్కరిస్తున్నట్లు కర్ణాటక పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రహమాన్ ఖాన్ శనివారం ప్రకటించారు. గురప్ప ప్రస్తుతం కేపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.