బెంగళూరు: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాటలోనే కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నడుస్తున్నది. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలని సిద్ధరామయ్య సర్కారు నిర్ణయించింది.
వీరందరికీ ప్రభుత్వ ప్రచారంలో భాగంగా బ్రాండ్ అంబాసిడర్షిప్లు, స్పాన్సర్డ్ పోస్టులు, అతిథి పాత్రలు, థీమ్, హ్యాష్‌టాగ్ ప్రచారాలు, షౌటవుట్లు, రివ్యూలు, ఈవెంట్ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్, వాట్సాప్‌ల్లో లక్ష కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.