బెంగళూరు, ఏప్రిల్ 28: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ఓ బహిరంగ సభలో సహనాన్ని కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ అందరి ముందే ఓ పోలీస్ అధికారి చెంపపై కొట్టబోయారు. బెళగావిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సిద్ధరామయ్య ప్రసంగించాల్సిన ఆ సభా వేదిక వెలుపల బీజేపీ మహిళా కార్యకర్తలు నిరసనకు దిగడంతో స్వల్ప ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ నారాయణ్ భారమణిని వేదికపైకి పిలిచిన సిద్ధరామయ్య..
ఆగ్రహంతో ఊగిపోతూ ఆ పోలీస్ అధికారిని కొట్టేందుకు చెయ్యెత్తారు. కానీ, అంతలోనే తమాయించుకుని ఆగిపోయారు. ఈ ఘటనపై విపక్ష జేడీఎస్ స్పందిస్తూ సిద్ధరామయ్య అహంకారంతో వ్యవహరించారని విమర్శించింది.