Chinnaswamy Stampede : చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బౌరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వాళ్లను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు.
‘చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని రీతిలో అభిమానులు తరలి రావడంతో ఈ దురదృష్టకరమైన ఘటన జరిగింది. దాదాపు 3 లక్షల మంది జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాం. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తాం’ అని సిద్ధరామయ్య తెలిపారు. అంతేకాదు తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆయన ఆదేశించారు.
అంతకుముందు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. 11 మంది అభిమానుల మృతికి కారణమైన ఈ విచారకరమైన సంఘటనకు తమదే బాధ్యత అని చెప్పారు. అవును.. తప్పు మాదే. తొక్కిసలాట జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు అంటూ మీడియాకు వెల్లడించారు శివకుమార్.
Welcome Home Boys♥️🏆
18 ವರ್ಷಗಳ ಕನಸನ್ನು 18ನೇ ಐಪಿಎಲ್ ಆವೃತ್ತಿಯಲ್ಲಿ ನನಸು ಮಾಡಿ, ನಮ್ಮ ಹುಡುಗ್ರು ತವರಿನ ಅಂಗಳಕ್ಕೆ ವಾಪಸ್ಸಾಗಿದ್ದಾರೆ.
ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಇತಿಹಾಸ ಸೃಷ್ಟಿಸಿದ ಆರ್ಸಿಬಿ ತಂಡಕ್ಕೆ ಕರ್ನಾಟಕದ ಮಣ್ಣಿನಿಂದ ಪ್ರೀತಿಯ, ಭವ್ಯ ಸ್ವಾಗತ!
Truly an honour to welcome you all to #NammaBengaluru!… pic.twitter.com/u3mnRjKp2O
— DK Shivakumar (@DKShivakumar) June 4, 2025