Kuldeep Yadav : భారత జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తన గూగ్లీతో బ్యాటర్లను బోల్తా కొట్టించే ఈ చైనామన్ బౌలర్ చిన్నప్పటి స్నేహితురాలిని మనువాడనున్నాడు. లక్నోలో కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం కుల్దీప్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాల్య స్నేహితురాలు వన్షికా(Vanshika)కు కుల్దీప్ ఉంగురం తొడిగాడు. అనంతరం ఆమె కూడా అతడికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగింది. ఈ వేడకకు టీ20 సంచలనం రింకూ సింగ్తో పాటు ఉత్తరప్రదేశ్ జట్టు క్రికెటర్లు హాజరయ్యారు.
కుల్దీప్ మనసు దోచిన వన్షికది కాన్పూర్ దగ్గర్లోని శ్యామ్ నగర్. ప్రస్తుతం ఆమె జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో పని చేస్తోంది. తను, కుల్దీప్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. స్కూల్ డేస్ తర్వాత కూడా తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. వయసు పెరిగేకొద్దీ వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. దాంతో, ఇరుకుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టే జూన్ 4న అందరి అంగీకారంతో వీళ్ల పెండ్లి చూపుల కార్యక్రమం జరిగింది.
Indian spinner Kuldeep Yadav, known as the ‘Chinaman’ of Indian cricket, got engaged to his childhood friend Vanshika in a private ceremony held in Lucknow on Wednesday. The intimate event was attended by close family members and several cricketers from Uttar Pradesh, including… pic.twitter.com/lqDouJiRVT
— IndiaToday (@IndiaToday) June 4, 2025
నిశ్చితార్థం వేడుకలో కుల్దీప్ క్రీమ్ కలర్ ప్యాంట్, సూట్ ధరించగా.. వన్షిక ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ లెహెంగాలో తళుక్కుమంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు ఆడిన కుల్దీప్.. 7.08 ఎకానమీతో 15 వికెట్లతో రాణించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ త్వరలోనే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.