ఘట్కేసర్, జూన్ 4: హైదరాబాద్ శివారు ఘట్కేసర్ పట్టణంలో పలుచోట్ల బుధవారం నాడు పోలీసులు విస్తత తనిఖీలు చేపట్టారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్నంగా పరిశీలించారు.
ఘట్కేసర్ పట్టణంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, దేవాలయాలు, మసీదులు, అత్యధిక జనసమూహం కలిగిన షాపింగ్ మాల్స్; మార్ట్స్ తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు పటిష్టమైన భద్రత కల్పించడంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పందిరి పరశురాం తెలిపారు.