ఖమ్మం రూరల్, జూన్ 04 : ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, గుదిమళ్ల గ్రామానికి చెందిన చేకూరి సుధాకర్ ఇంజినీరింగ్ ఈసీఈ విభాగంలో జేఎన్టీయూహెచ్ నుండి డాక్టరేట్ అందుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ వీసీ టీకెకె రెడ్డి, ఛాన్సలర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో డాక్టరేట్ పట్టాను బుధవారం అందుకున్నాడు. నెట్వర్క్ లైఫ్ టైం ఎన్‌హ్యాన్స్‌మెంట్ టెక్నిక్స్ ఫర్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అనే అంశం మీద జేఎన్టీయూహెచ్ ఆచార్యులు డాక్టర్ సత్య సావిత్రి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ లభించింది.