Viral News | బిచ్చమెత్తి 30 బస్తాల డబ్బు కూడబెట్టింది.. అనుభవించకుండానే కన్నుమూసింది..!
Viral News | ర్ణాటక (Karnataka) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన ఓ 68 ఏళ్ల మహిళ ఇంట్లో రూ.8.40 లక్షల నగదు బయటపడింది. ఆమె మొత్తం 30 కి పైగా బస్తాల్లో నోట్ల (Currency Notes) ను, నాణేల (Coins) ను దాచిపెట్టింది. అయితే ఆ డబ్బును ఆమె ఉపయోగించుకోకుండానే కన్నుమూసింది.
Viral News : కర్ణాటక (Karnataka) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన ఓ 68 ఏళ్ల మహిళ ఇంట్లో రూ.8.40 లక్షల నగదు బయటపడింది. ఆమె మొత్తం 30 కి పైగా బస్తాల్లో నోట్ల (Currency Notes) ను, నాణేల (Coins) ను దాచిపెట్టింది. అయితే ఆ డబ్బును ఆమె ఉపయోగించుకోకుండానే కన్నుమూసింది. మాండ్య (Mandya) లో ఇటీవల ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మాండ్యకు చెందిన హూర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. ఆమె మరణించిన తర్వాత స్థానికులు ఆమె ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బస్తాల్లో పెద్ద మొత్తంలో నగదు కనిపించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లు భారీగా ఉన్నాయి. వేల సంఖ్యలో నాణేలు కూడా బయటపడ్డాయి. హూర్ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. ఆమె సోదరి రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఇద్దరికీ వివాహం కాలేదు. హూర్ జీవితమంతా భిక్షాటన చేస్తూ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
బస్తాల్లో ఉన్న నగదును స్థానికులు బయటకు తీసి లెక్కించారు. మొత్తం రూ.8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆమె ఇంట్లో దొరికిన నగదును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ.6 లక్షలు తీసుకోగా.. మరో సోదరుడికి రూ.2.40 లక్షలు దక్కాయి. ఆ మొత్తాన్ని ఆయన మసీదుకు విరాళంగా ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

