రాష్ట్ర శాసనసభ సాక్షిగా సోమవారం ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై రేవంత్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగింది. అసెంబ్లీలో ఎక్కడ తమను నిలదీస్తారోననే భయంతో నిర్బంధానికి తెరలేపింది. పోలీసులను అడ్డుపెట్టుకొని అసెంబ్లీ గేటు ఎదుటే బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నది. నల్లషర్టులు ధరించి వచ్చారనే సాకుతో వారిని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది.
కీలక నేతలు వారించే ప్రయత్నం చేసినా పోలీసులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యేలని చూడకుండా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో పలువురు సభ్యులు గాయాలపాలయ్యారు. వారిని దవాఖానకు తరలిస్తామని చెప్పినా వదల్లేదు.

శాసనసభ గేట్ ఎదుట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

శాసనసభ ఎదుట బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావును ఎత్తుకెళ్తున్న పోలీసులు

బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితాఇంద్రారెడ్డిని అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకొని అక్కడి నుంచి తరలిస్తున్న మహిళా పోలీసులు

అసెంబ్లీ గేటు ఎదుట పోలీసుల దాడిలో గాయపడి ఇంజెక్షన్ వేయించుకుంటున్న కేటీఆర్

ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, అనిల్‌జాదవ్‌ను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు

శాసనసభ వద్ద ఎమ్మెల్యేలు గంగుల, సంజయ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తరలిస్తూ..

ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని తరలిస్తున్న పోలీసులు

పోలీసుల తీరుకు నిరసనగా అసెంబ్లీ గేటు ఎదుట బైఠాయించిన మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి, చిత్రంలో తలసాని, మాధవరం

నిమ్స్‌లో జగదీశ్‌రెడ్డిని పరామర్శిస్తున్న కేటీఆర్, దామోదర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, పల్లా, పాడి కౌశిక్‌రెడ్డి

మహిళా పోలీసులను అడ్డుపెట్టి ఎమ్మెల్యేలను నిలువరిస్తున్న పోలీసులు